

స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (డబ్ల్యూబీడీ) ఆస్తుల కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. దీంతో పారామౌంట్ గ్లోబల్–స్కైడ్యాన్స్కు మార్గం సుగమమైంది. డబ్ల్యూబీడీకి చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాల కోసం నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్, పారామౌంట్ మధ్య పోటీ జరిగింది. మొదట నెట్‌ఫ్లిక్స్‌తో తాత్కాలిక ఒప్పందం కుదిరినా, ఒక్కో షేరుకు 30 డాలర్ల హాస్టైల్ బిడ్‌తో పారామౌంట్ ముందుకు రావడంతో పరిస్థితి మారిపోయింది.
చర్చల సమయంలో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ వైట్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం డబ్ల్యూబీడీ, పారామౌంట్ ఆఫర్ మెరుగైనదని ప్రకటించింది. యాజమాన్యం మద్దతు లేకపోయినా వాటాదారులను నేరుగా లక్ష్యంగా చేసుకుని చేసే ప్రతిపాదనను ‘హాస్టైల్ బిడ్’ అంటారు. ఈ ప్రకటన తర్వాత నెట్‌ఫ్లిక్స్ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
ఈ ఒప్పందం కుదిరితే సీఎన్ఎన్, హెచ్‌బీఓ మ్యాక్స్ వంటి ప్రముఖ వ్యాపారాలు స్కైడ్యాన్స్ కిందకు వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు ప్రధాన హాలీవుడ్ స్టూడియోలు ఒకే గొడుగు కిందకి రానున్నాయి. అయితే ఈ విలీనం అమెరికా సహా ఇతర దేశాల్లో యాంటీ ట్రస్ట్ పరిశీలనను ఎదుర్కొనే అవకాశం ఉంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!