

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలపై చర్చ సాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడటం భారత చమురు దిగుమతులపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 104 డాలర్ల వరకు చేరినట్లు సమాచారం. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిన తర్వాత ఇంధన ధరల సవరణపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడం, వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో ఆందోళన నెలకొంది. హోర్ముజ్ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం, భారత దిగుమతుల్లో 40 శాతం జరుగుతుండటంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇంధన ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!