
సినిమాలు

తమిళ స్టార్ ధనుష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న D56 సినిమాలో హీరోయిన్గా మొదట కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ‘ధురంధర్’ సిరీస్‌తో గుర్తింపు పొందిన సారా అర్జున్ పేరు ముందుకు వస్తోంది. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సారా హీరోయిన్గా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన లేదు. ధురంధర్ సిరీస్ హిట్ కావడంతో సారా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది, ఇక ముందు ఆమెకు ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!