

టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సంప్రదాయాలను అవమానించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొన్ని దుష్ట శక్తులు హిందుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని, అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మం మరింత బలంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల ద్వారా హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 298 ప్రకారం మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యలకు శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఇప్పటికే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు, క్రిమినల్ కేసుల కోసం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాగే కొంతమంది పాస్టర్లు యూట్యూబ్‌లో చేస్తున్న వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందూ దేవాలయాలు సెక్యులర్ స్థలాలు కావని, అవి పూర్తిగా మతపరమైన ప్రార్థనా స్థలాలేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాల రక్షణకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!