

సినిమా, టీవీ మరియు నాటక రంగాలకు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డులపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని, త్వరలోనే ఈ అవార్డులను ప్రదానం చేస్తామని మంత్రి వెల్లడించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని, ఆ తర్వాత ఈ అవార్డులు నిలిచిపోయాయని దుర్గేష్ తెలిపారు. ఇప్పుడు మళ్లీ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే అవార్డులు ఇవ్వాలా, లేక కొన్ని మార్పులు చేయాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.
ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు నందమూరి బాలకృష్ణ నుంచి సలహాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రెండు నుంచి మూడు నెలల్లో నంది అవార్డుల వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నంది నాటకోత్సవాలను కూడా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!