

దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ముందుగా స్వీకరించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు సాంకేతికాలుగా గుర్తించి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ‘క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్’ ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టాలెంట్, రీసెర్చ్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కీలక కేంద్రంగా నిలవనుంది.
ఇప్పుడు ఇదే బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందుకు వస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ హెల్త్‌కేర్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన, క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ ఆరోగ్యరంగాన్ని పూర్తిగా సాంకేతిక ఆధారిత రంగంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. డాక్టర్లు నూతన సాంకేతికతలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించడంతో పాటు, వైద్యవృత్తిలో మానవీయ స్పర్శను కోల్పోకూడదని హితవు పలికారు.
గుండె సంబంధిత వ్యాధులతో మరణాలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, కార్డియాక్ సమస్యల నివారణకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. పాఠశాల విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇవ్వడంలో డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. చంద్రబాబు చేపడుతున్న సాంకేతిక దారిని రేవంత్ కూడా అనుసరిస్తుండటం, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు ఆశాజనక సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!