

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోరు అసలు కీలక దశకు చేరుకుంది. వారం రోజులుగా మైకుల హోరు, నేతల ప్రసంగాలు, హామీలు, ఓటర్లను కలిసే కార్యక్రమాలతో పురవీధులు సందడిగా మారాయి. ప్రచారం ముగిసిన అనంతరం నుంచి పోలింగ్ వరకు ఉన్న 48 గంటల నిశ్శబ్ద కాలమే ఎన్నికల ఫలితాలను మార్చే అసలైన ‘టర్నింగ్ పాయింట్’ గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ రెండు రోజుల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయని సమాచారం. ప్రధాన మున్సిపాలిటీలలో ఓటుకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు, చిన్న మున్సిపాలిటీలలో రూ.1,000 నుంచి రూ.3,000 వరకు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నగదుతో పాటు మద్యం, మాంసం పంపిణీ కూడా రహస్యంగా కొనసాగుతోందని తెలుస్తోంది. అదేవిధంగా కులాలు, మతాల వారీగా సమూహ ఒప్పందాలు, దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి హామీలతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వార్డు వారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఫలితాలపై ప్రభావం చూపే చర్యలు చేపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!