
టెక్నాలజీ

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు చేరుకుంటుండటంతో పస్రా నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ ఏర్పడింది. దర్శనానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందం మేడారాన్ని సందర్శించనుంది. మధ్యాహ్నం సమ్మక్క–సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాస్టర్ ప్లాన్ పనులను మంత్రులు పరిశీలించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి వెళ్లనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!