
బిజినెస్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలో కీలక రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.
ఇరాన్లో 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే మండలి మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. నిర్ణయాత్మక ఓటింగ్ ద్వారా ఆయనకు మద్దతు లభించినట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీ వయసు 56 సంవత్సరాలు.
ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలు దేశ ఐక్యతను కాపాడుకోవాలని, కొత్త నాయకుడికి పూర్తి మద్దతు ఇవ్వాలని అధికారిక వర్గాలు పిలుపునిచ్చాయి. దేశం ముందుకు సాగేందుకు అందరూ కలిసి పనిచేయాలని కూడా పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!