

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, పూజారులు సీఎంను కలిసి జాతరకు అధికారికంగా ఆహ్వానాన్ని అందజేశారు. అనంతరం లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమ్మక్క సారలమ్మ పూజారులతో కలిసి అందజేశారు. ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు గవర్నర్కు ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు, శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న మౌలిక సదుపాయాల వివరాలను మంత్రులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేయగా, జాతర విశిష్టతను ప్రశంసించిన గవర్నర్ తప్పకుండా ఒక రోజు స్వయంగా ఈ మహా జాతరను దర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో వీరస్వామి కూడా పాల్గొన్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!