

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులు–2026కు ఎంపికైన తెలుగు ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి దేశ స్థాయిలో గుర్తింపు పొందిన వారికి ఈ జాతీయ గౌరవాలు దక్కడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, కళా విభాగంలో సినీనటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీ మోహన్లకు పద్మశ్రీ లభించింది. అలాగే కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు (వైద్యం), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం), దీపికా రెడ్డి (నృత్యం), గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్), యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్లకు పద్మశ్రీ వరించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తమ తమ రంగాల్లో ముద్రవేసిన ఈ స్ఫూర్తిదాతలు తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారని నారా లోకేష్ పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!