

2025 - 26 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో (ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు) దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బంగారం దిగుమతులు 28.73 శాతం పెరిగి 6,900 కోట్ల డాలర్లకు (రూ.6.49 లక్షల కోట్లు) చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇవి 5,353 కోట్ల డాలర్లుగా (రూ.5.03 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు కూడా 31,060 కోట్ల డాలర్లకు (రూ.29.20 లక్షల కోట్లు) పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,500 గా ఉంది. భారత్కు బంగారం సరఫరా చేస్తున్న దేశాల్లో స్విట్జర్లాండ్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా సుమారు 5 శాతంగా ఉంది.








.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!