

భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు ట్వీట్ ద్వారా పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేశారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విప్లవ శక్తిగా బీఆర్ఎస్ను పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో ఉద్యమ తెలంగాణను అభివృద్ధి తెలంగాణగా మార్చి ప్రపంచానికి గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన హరీశ్ రావు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంక్షేమం తగ్గిపోయి అభివృద్ధి నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో మార్మోగుతున్న నినాదం మార్పు కోరుకుంటోందని పేర్కొంటూ, కే. చంద్రశేఖర్ రావు తిరిగి రావాలనే డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. ఉద్యమం నుంచి అధికారంలోకి, అక్కడి నుంచి ప్రతిపక్షంగా ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచిన పార్టీ బీఆర్ఎస్ అని, త్వరలోనే తెలంగాణ అభివృద్ధి పునఃప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!