
సినిమాలు

జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్వీయ జనగణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం జనగణనలో భాగస్వామ్యం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సరైన లబ్ధిదారులకు చేరుతాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. స్వీయ నమోదు విధానం ద్వారా సమాచార సేకరణ మరింత సులభంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!