
ఆరోగ్యం

మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా జాతర నిర్వహణకు సంస్థాగత రూపం కల్పించారు. ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా ఇర్ప సుకన్య సునీల్ దొరను నియమించగా, డైరెక్టర్లుగా మొత్తం 15 మందిని ఎంపిక చేశారు. మేడారం ఈవో వీరస్వామి ఆధ్వర్యంలో బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యులను అభినందించారు. సమ్మక్క – సారలమ్మ మహాజాతరను మరింత సవ్యంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ట్రస్ట్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. భక్తుల సౌకర్యాలు, సంప్రదాయాల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!