

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీతో మేడారం ప్రాంతం పూర్తిగా జనసంద్రంగా మారింది. గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు బారులుదీరారు. “సమ్మక్క… సారలమ్మ” నామస్మరణతో అరణ్య ప్రాంతం భక్తిభావంతో మార్మోగుతూ, జాతరకు తరలివచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
భారీ రద్దీ కారణంగా మేడారం నుంచి తాడ్వాయి వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో 14 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల వరకు సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. గోవిందరావుపేట మండలం ఎస్తా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో, ప్రైవేట్ వాహనాలను పస్తా మార్గం మీదుగా, ఆర్టీసీ మరియు విఐపీ వాహనాలను తాడ్వాయి మార్గం మీదుగా మళ్లించారు. తగిన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!