

కృష్ణా జిల్లా లోని గుడివాడ లో ఉన్న యూనియన్ బ్యాంకు లో శనివారం ఉదయం అకస్మికంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ రోడ్డు లోని బ్యాంకు భవనం నుంచి ఒక్కసారిగా పొగలు ఎగసిపడటం తో అక్కడి ప్రజలు భయాందోళన కు గురయ్యారు. పొగలు ఎక్కువగా వ్యాపించడం తో ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్థానికులు వెంటనే పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు లోపలికి చేరడానికి అద్దాలు పగలగొట్టి మంటలపై నీరు చల్లుతున్నారు. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదంలో బ్యాంకు లోని కంప్యూటర్లు, ఫర్నిచర్, పత్రాలు వంటి కొన్ని సామగ్రి దగ్ధమైనట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని బ్యాంక్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ప్రజలను దూరంగా ఉంచుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!