

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు గణనీయమైన ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మలేషియాకు చెందిన కంపెనీలు అమరావతిలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రజా రాజధానిని సందర్శించేందుకు మలేషియా ప్రతినిధి బృందం శుక్రవారం అమరావతికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు వారితో సమావేశమై రాజధాని నిర్మాణ పురోగతిని వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మలేషియా బృందం సభ్యులు స్పష్టం చేశారు.
రాజధాని అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణతో కూడిన ప్రతినిధి బృందాలు ఇప్పటికే పలు దేశాలు పర్యటించాయి. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతులు, పెట్టుబడి అనుకూల విధానాలు, అభివృద్ధి దృష్టికోణాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.
ఇక నవంబర్ రెండో వారం చివర్లో సీఐఐ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నట్లు ఇప్పటికే నిర్ధారణ కావడం రాష్ట్ర పెట్టుబడి అవకాశాలకు మరింత బలం చేకూర్చింది.





.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!