

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వరుసగా జి. సృజన మరియు వినయ్ కృష్ణారెడ్డిలను కమిషనర్లుగా నియమించింది. అలాగే జలమండలి జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్‌ను నియమిస్తూ సీఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జ్యోతి బుద్ధ ప్రకాశ్: సింగరేణి (SCCL) మేనేజింగ్ డైరెక్టర్.జి. సృజన: కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.టి. వినయ్ కృష్ణారెడ్డి: కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్.ఆర్.వి. కర్ణన్: కమిషనర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.మయాంక్ మిట్టల్: జాయింట్ ఎండీ, జలమండలి (HMWSSB).సందీప్ కుమార్ సుల్తానియా: ప్లానింగ్ సెక్రటరీ (అదనపు బాధ్యతలు).డి. దివ్య: పంచాయతీరాజ్ కమిషనర్ (అదనపు బాధ్యతలు).సబ్యసాచి ఘోష్: సెక్రటరీ, ఎస్సీ అభివృద్ధి శాఖ (అదనపు బాధ్యతలు).నగర విభజన ప్రక్రియను వేగవంతం చేయడం మరియు పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!