
.webp&w=3840&q=75)
మారేడుమిల్లి అడవుల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్పై కొత్త వివరాలు బయటకు వచ్చాయి. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపినట్టు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా తెలిపారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. మృతుల్లో కీలక మావోయిస్టు నేత హిడ్మా, అతని భార్యతోపాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారని వివరించారు. ఇంకా ఐదుగురికి పైగా మావోయిస్టులు అడవిలోకి పారిపోయినట్లు తెలిపారు.
ఇటీవల మావోయిస్టులకు సహాయం చేసిన 31 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరింత సమాచారం ఆధారంగా మరో 26 మందిని పట్టుకోవాల్సి ఉందని అడిషనల్ డీజీ వెల్లడించారు.
హతమైన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేపడుతున్నట్లు తెలిపారు. మృతి చెందినవారు ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందినవారని గుర్తించాం, వారి కుటుంబాలకు సమాచారం అందిస్తున్నాం అని డీజీ చెప్పారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!