.png&w=3840&q=75)

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ తన ఆకర్షణీయమైన కళ్లతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికి ‘లవ్ జిహాద్’ కోణాన్ని ఇవ్వడం సరైంది కాదని చెప్పారు. పెళ్లి అనంతరం కేరళలో తన భర్తతో కలిసి ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.
కేరళలోని అరుమనూర్ ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ వివాహం పూర్తిగా హిందూ ఆచారాల ప్రకారం జరిగిందని చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ప్రతి మతాన్ని సమానంగా చూస్తానని తెలిపారు. తమిద్దరూ తమ తమ మతాలను మార్చుకోలేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాహంపై వస్తున్న ప్రచారాలకు వారు ముగింపు పలికారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలు మరియు గాజులు అమ్ముతున్న వీడియోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ ప్రజాదరణతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను గుర్తించి ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆమె ఇండోర్‌లో నటన శిక్షణ తీసుకుని, సినిమా రంగంలో స్థిరపడేందుకు ముంబైకి వెళ్లారు. అయితే ఇటీవల తన తండ్రి తన ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఇండోర్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్లో ఆమె రక్షణ కోరుతూ ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితుల్లోనే ఆమె వివాహం చేసుకోవడం గమనార్హం.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!