

రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇద్దరిపై లైంగిక దాడి చేసి, అందులో ఒకరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో నిందితుడు పలుమార్లు తన వాంగ్మూలాన్ని మార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, తన వల్ల తప్పు జరిగిందని అతను నేరాన్ని ఒప్పుకున్నాడు.
దర్యాప్తు ప్రకారం, రాజస్థాన్లో తన స్నేహితుడి భార్యపై దాడి చేసిన నిందితుడు, అనంతరం ఢిల్లీకి వెళ్లి మరో ఘటనకు పాల్పడ్డాడు. అక్కడ ఒక ఇంటిలోకి ప్రవేశించి యువతిపై లైంగిక దాడి చేసి, ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యాడు. సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో పని చేసిన ఇంటి యజమానిపై ఉన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!