

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన LVM-3 M-6 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2 ను కేవలం 15 నిమిషాల్లోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇంతటి భారీ వాణిజ్య ఉపగ్రహాన్ని తొలిసారిగా ఇస్రో నింగిలోకి పంపడం విశేషంగా నిలిచింది.
ఈ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో నిర్వహించింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్. నారాయణన్ స్పందిస్తూ దీనిని “బాహుబలి ప్రయోగం” గా పేర్కొన్నారు. ఎల్వీఎం-3 రాకెట్ సిరీస్‌లో ఇది తొమ్మిదవ విజయవంతమైన ప్రయోగమని తెలిపారు. తక్కువ సమయంలోనే రాకెట్‌ను సిద్ధం చేసి అంతర్జాతీయ కస్టమర్ కోసం ఈ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించామని ఆయన వెల్లడించారు.


.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!