

ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి మారబోతోందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరికలు ఇచ్చింది. ప్రస్తుతం చలి తీవ్రంగా పెరిగి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఇదే సమయంలో అల్పపీడనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, అది రాబోయే సోమవారం నాటికి వాయుగుండంగా మారే ప్రమాదం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ ప్రభావంతో ఇవాళ తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ పనుల్లో ఉన్న ఏపీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఈ వర్షాలు రేపటి వరకు కొనసాగవచ్చని వాతావరణశాఖ తెలియజేసింది.
అదేవిధంగా, తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 నుండి 10 డిగ్రీల వరకు పడిపోవడంతో ప్రజలు భారీగా చలిని అనుభవిస్తున్నారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!