

లియోనెల్ మెస్సీ కేవలం ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాలర్ మాత్రమే కాదు, అత్యంత ధనవంతుల అథ్లెట్లలో ఒకడు. అతని రూ. 7,665 కోట్లకు పైగా వ్యాపార సామ్రాజ్యంలో లగ్జరీ హోటళ్లు, దుస్తుల బ్రాండ్లు, మీడియా సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఇంటర్ మయామితో భారీ కాంట్రాక్ట్ మరియు అనేక బ్రాండ్ ప్రమోషన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఇబిజా, మలోర్కా, సిట్గేజ్, బకీరా, అండోరాల్లో ఎంఐఎం హోటళ్ల చైన్‌ను మెస్సీ కలిగి ఉన్నాడు. 2019 లో బార్సిలోన లో ది మెస్సీ స్టోర్ పేరుతో స్పోర్ట్స్ మరియు లైఫ్‌స్టైల్ దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించాడు. 2024లో మాస్+ అనే ఎనర్జీ డ్రింక్ బ్రాండ్‌ను విడుదల చేసి అమెరికా మార్కెట్లో మంచి విజయం సాధించాడు.
2022 లో మెస్సీ రోజారియో మీడియా కంపెనీని స్థాపించి ఫ్యామిలీ, స్పోర్ట్స్, ఓటీటీ కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. అలాగే ఎల్ క్లబ్ డి లా మిలనెసా హోటల్ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాడు. 2022 లో ప్లే టైమ్ స్పోర్ట్స్ అనే టెక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థను కూడా ప్రారంభించి, క్రీడలు దాటి వ్యాపార రంగంలో కూడా తన ప్రభావాన్ని విస్తరించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!