
క్రీడలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘మీర్జాపురంరాణి - కృష్ణవేణి’ పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవి ఆయనకు అందజేయగా, ఈ సందర్భంగా ఆమె జీవిత ప్రయాణాన్ని గ్రంథరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందని తెలిపారు.
బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టి కథానాయికగా ఎదిగిన కృష్ణవేణి, అనంతరం నిర్మాతగా ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించినట్లు ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ‘మనదేశం’ సినిమాతో పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. పలు దిగ్గజ కళాకారులకు చేయూతనిచ్చిన కృష్ణవేణి చిరస్మరణీయురాలని కొనియాడారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!