
న్యూస్

మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి తమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.

అంత్యక్రియలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై అజిత్ పవార్‌కు నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖ రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. అభిమానుల భారీ హాజరు అజిత్ పవార్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!