
గాసిప్స్

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన సౌమ్య కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.
సౌమ్య మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్న ఆయన, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!