
న్యూస్

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు బయటపెట్టారు. విచారణలో శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు.ఎర్రిస్వామి తెలిపిన వివరాల ప్రకారం – “బంక్లో పెట్రోలు పోసిన తర్వాత బైక్ను శివశంకర్ నడిపాడు. రోడ్డు తడిగా ఉండటంతో బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. తాను గాయపడడంతో భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను,” అని తెలిపాడు.తర్వాత రోడ్డుపై పడిన బైక్ను వేమూరి కావేరి బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ వివరాలతో బస్సు ప్రమాదం వెనుక నిజాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!