
ఆరోగ్యం

జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మొత్తం మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు ఏర్పాటు చేయగా, సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనరేట్లను చెరో 3 జోన్లుగా పునర్విభజించారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, నేర నియంత్రణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులతో ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణ మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!