

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు కేరళ ప్రభుత్వం ఘన సన్మానం చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించి సంజూను సత్కరించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి వెల్లడించారు. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు భారీ స్కోరు అందించడంలో సంజూ కీలక పాత్ర పోషించాడని ఆయన ప్రశంసించారు.
సంజూ విజయం కేరళకు గర్వకారణమని, రాష్ట్రంలోని వేలాది యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని తీరప్రాంతంలో పెరిగి స్థానిక మైదానాల్లో క్రికెట్ ఆడుతూ తన కలను సాకారం చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణించి భారత జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఎదిగాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా సంజూ మంచి గుర్తింపు పొందాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!