

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రాన్ని అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ గోవాలో నిర్వహించిన కార్యక్రమంలో చేసిన హావభావాలు, వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తప్పుబట్టింది. ఈ ఘటనపై దాఖలైన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం, ఇతరుల సంస్కృతి మరియు సంప్రదాయాలను అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు ప్రముఖులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోర్టు సూచించింది. దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్లో అభ్యంతరం వ్యక్తమైంది.
రణ్‌వీర్‌సింగ్ తరఫున న్యాయవాది సాజన్ పూవయ్య వాదిస్తూ, ఈ ఘటన అవగాహన లోపంతో జరిగిందని, ఎవరినీ బాధించాలన్న ఉద్దేశం లేదని తెలిపారు. ఇప్పటికే నటుడు క్షమాపణ కూడా చెప్పినట్లు కోర్టుకు వివరించారు. అయితే క్షమాపణ చెప్పడం ద్వారా చేసిన చర్యల ప్రభావం పూర్తిగా తొలగిపోదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇంకా అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేస్తూ, అప్పటి వరకు బలవంతపు చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!