
గాసిప్స్
.jpg&w=3840&q=75)
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. జి. నరేంద్రబాబు మరియు పసల మోహిత్ 100 పర్సెంటైల్ సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు. ఇందులో ఓబీసీ విభాగంలో జి. నరేంద్రబాబు దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించడం విశేషం.
అదేవిధంగా ఎస్సీ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవ శ్రీవేద్ మొదటి ర్యాంకు పొందారు. తెలంగాణకు చెందిన వివన్ శరత్ మహేశ్వరి కూడా 100 పర్సెంటైల్ సాధించారు. ఈసారి జేఈఈ మెయిన్స్ పరీక్షను మొత్తం 13.04 లక్షల మంది విద్యార్థులు రాయగా, పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!