
న్యూస్

ఇన్కమ్ టాక్స్ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం నగరాల్లో ఉన్న కొన్ని రెస్టారెంట్లలో ఈ సోదాలు జరిగాయి. కస్టమర్లకు సరైన బిల్లులు ఇవ్వకుండా పన్నులు ఎగ్గొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
సోదాల సమయంలో రెస్టారెంట్లకు సంబంధించిన కంప్యూటర్ డేటా, ఆర్థిక రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే ఆన్లైన్ చెల్లింపులు మరియు డిజిటల్ లావాదేవీల వివరాలను కూడా పరిశీలిస్తూ పన్ను ఎగవేత జరిగిందా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!