
గాసిప్స్
.webp&w=3840&q=75)
తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా, డిసెంబర్ 27, 28, 29 తేదీలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. మూడు రోజుల పాటు ఈ ఆఫ్లైన్ టికెట్లు అందుబాటులో ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.

ఈ మేరకు తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్లలోను, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలోను శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ చేయబడవు. ఈ విషయాన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను ముందుగానే సరిచేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!