
క్రీడలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న విషయంపై చర్చ జరిగింది. ఈ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ చేసిన కృషిని ప్రశంసించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని బండి సంజయ్ తెలిపారు. అలాగే “మోదీ గిఫ్ట్” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు అందించిన విషయాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధుల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవ చేయాలని, అట్టడుగు వర్గాలకు కేంద్ర సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ప్రధాని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!