
సినిమాలు
.avif&w=3840&q=75)
పశ్చిమాసియాలో యూఎస్ స్థావరాలు మరియు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. మొత్తం 390 క్షిపణులు, 830 డ్రోన్లతో వివిధ లక్ష్యాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా యూఏఈపై 541 డ్రోన్లు, 165 క్షిపణులతో దాడులు జరిగాయని వెల్లడైంది. అయితే వాటిలో 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చివేశామని యూఏఈ అధికారులు ప్రకటించారు. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ కూడా దాడికి గురై, భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇదే సమయంలో కువైట్పైనా ఇరాన్ 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడులు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రాంతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని సమీక్షిస్తూ శాంతి స్థాపనకు పిలుపునిస్తోంది.





.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!