

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరగనున్న కీలక పోరుకు గిల్ అందుబాటులో ఉంటాడని గుజరాత్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ వెల్లడించాడు. శుభ్‌మన్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. మెడ కండరాల గాయంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు గిల్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో జట్టును వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ నడిపించాడు. అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ గిల్ ఆడటంపై స్పందించాడు. ‘గుజరాత్ టైటాన్స్‌కు గిల్ బలం. అలాంటి ఆటగాడు జట్టులో లేకపోతే ప్రత్యర్థి బౌలర్లకు కొంత ఊరట ఉంటుంది. కానీ గిల్ ఒక్కసారి ఫామ్ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పేసుకునే సత్తా అతడిలో ఉంది’ అని అన్నాడు. మొత్తంగా కీలక సమయంలో కెప్టెన్ గిల్ తిరిగి జట్టులో చేరడం గుజరాత్‌కు పెద్ద బూస్ట్ అప్‌గా మారింది. ఢిల్లీలో జరిగే ఈ పోరులో గిల్ నాయకత్వం జట్టును విజయపథంలోకి తీసుకువస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!