

హీరో నాగ శౌర్య మాస్ అవతార్‌లో కనిపించనున్న చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్. రామ్ దేశినా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 17 న విడుదల కానుండగా, తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు, కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగ శౌర్య మాట్లాడుతూ, ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు. ఆరెంజ్ సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్‌తో పని చేయాలని అనుకున్నానని, ఈ చిత్రంతో ఆ అవకాశం దొరికిందని చెప్పారు. ఈ చిత్రానికి ఆయన మంచి సంగీతం అందించారని తెలిపారు. అలాగే వెన్నెల కిషోర్, సముద్రఖని, సాయికుమార్ సహా మొత్తం టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!