
క్రీడలు

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు వచ్చే నెల18 వరకు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రంగా సెట్ బీని అధికారులు ఎంపిక చేశారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు ప్రవేశానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యంపై కఠినంగా వ్యవహరించవద్దని ప్రధాన కార్యదర్శి సి ఎస్ రామకృష్ణ రావు పదో తరగతి, ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!