
గాసిప్స్

కేంద్ర ప్రభుత్వం ఇండిగో విమానాల సంక్షోభంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తును ఆదేశిస్తూ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది.
FDTL నిబంధనలను DGCA సవరించడం సరికాదని ప్రభుత్వం పేర్కొంటూ, ఆ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతపై రాజీ పడబోమని స్పష్టం చేస్తూ, రద్దయిన ఫ్లైట్లకు పూర్తి రీఫండ్ చెల్లించడంతో పాటు ప్రయాణికులకు వసతి సదుపాయాలు కల్పించాలని కేంద్రం సూచించింది.




.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!