

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ 75 వ స్థానంలో నిలిచింది. గతేడాది 85 వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 10 స్థానాలు ఎగబాకడం విశేషం. తాజా ర్యాంకింగ్ ప్రకారం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు ముందస్తు వీసా లేకుండా 56 దేశాలకు ప్రయాణించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యం పెరుగుతోందని ఈ మెరుగుదల సూచిస్తోంది.
అయితే ఇది భారత్ సాధించిన అత్యుత్తమ స్థానం కాదు; 2006 లో 71 వ ర్యాంకు ఇప్పటివరకు అత్యుత్తమంగా నిలిచింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్‌పోర్ట్ మరోసారి అగ్రస్థానంలో నిలిచి 192 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా రెండో స్థానాన్ని పంచుకోగా, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ,ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!