

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (Jemima Goldsmith) బహిరంగ లేఖ రాశారు. తన ఎక్స్ (X) ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పరిస్థితి గురించి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని వెల్లడించారు.
జెమీమా మాట్లాడుతూ, చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్న తన భర్తను చూసేందుకు, మాట్లాడేందుకు తమ ఇద్దరు కుమారులకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం సోషల్ మీడియాలోని ‘ఎక్స్’ ద్వారా మాత్రమే ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నామని చెప్పారు.
2023 నుంచి ఇమ్రాన్ అడియాలా జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన మృతి చెందారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఏర్పడింది. ఆ తర్వాత మద్దతుదారులు ఆయనను కలవాలని నిరసనలు చేశారు. చివరికి ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ మాత్రమే జైల్లో కలిసే అవకాశం ఇచ్చారు, ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!