
గాసిప్స్

iBOMMA రవిపై పోలీసులు మరో మూడు కేసులను నమోదు చేసి, తాజాగానే అదనపు అరెస్ట్ చూపించారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ సినిమాలపై పైరసీకి సంబంధించిన మూడు వేర్వేరు కేసులు నమోదైనట్టు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపర్చగా, కోర్టు అతడికి మరో 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
రవికి బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. అతడు బెయిల్ మీద బయటకు వస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో రవి వేసిన బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!