
టెక్నాలజీ

సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి తెలిపారు. అయితే తన కుమార్తె కేసులో పూర్తి న్యాయం జరిగిందని మాత్రం అనుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని హత్య చేశారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు సరిగ్గా బయటపడి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదని సరోజినీ దేవి చెప్పారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి వేరే రిపోర్టు తెప్పించారని, కానీ మునిస్వామి నివేదికను కూడా పరిశీలించి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. తన కూతురు మృతదేహాన్ని కూడా చూడలేదని, ఎలా మరణించిందో ఇప్పటికీ తెలియదని ఆమె వేదన వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!