
న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం రాష్ట్రంలో తీవ్రమైన ఎండతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు జిల్లా నగరడోనలో గరిష్ఠంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు.
రేపు 20న పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 17 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, పశుపాలకులు ఉరుములతో కూడిన వర్ష సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!