
బిజినెస్

హైదరాబాద్కు చెందిన భక్తుడు, నిలోఫర్ కేఫే యజమాని బాబూరావు, తిరుమల శ్రీవారికి వజ్రాలతో పొదిగిన బంగారు యజ్ఞోపవీతంను సమర్పించారు. కిలోల బంగారంతో, కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ యజ్ఞోపవీతాన్ని టీటీడీ అధికారులకు ఆయన అందజేశారు.
శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో “యజ్ఞోపవీతం ఇస్తావా?” అన్నట్టుగా దేవుడు తనకు అనిపించారన్నారు బాబూరావు. వెంటనే ఆ ఆదేశంగా భావించి, నెలరోజులు కూడా ఆలస్యం చేయకుండా యజ్ఞోపవీతాన్ని తయారు చేయించి టీటీడీకి అందజేశానని చెప్పారు. ఈ బంగారు యజ్ఞోపవీతం విలువ దాదాపు రూ. 4.5 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!