
గాసిప్స్

హాంకాంగ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరణాల సంఖ్యను భారీగా పెంచింది. మొత్తం 32 అంతస్తులు కలిగిన ఏడు టవర్స్‌లో చెలరేగిన మంటలు భయానక రూపం దాల్చాయి. ఇప్పటి వరకు 93 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 280 మంది ఆచూకీ తెలియకుండా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
అగ్నిమాపక సిబ్బంది గత 48 గంటలుగా 304 అగ్నిమాపక వాహనాలతో శ్రమిస్తున్నప్పటికీ, మంటలు పూర్తిగా అదుపులోకి రావడం లేదు. టవర్స్‌లోని అనేక అపార్ట్మెంట్లు పూర్తిగా శిథిలాలుగా మారి, అనేక ప్రాంతాలు శవాల దిబ్బలుగా ఉన్నాయని రిపోర్టులు సూచిస్తున్నాయి.
ఇప్పటి వరకు 76 మంది గాయపడగా, వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇంకా చాలామంది భవనాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!