
.jpg&w=3840&q=75)
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరియు సమీప ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు చేరడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
టోకెన్లు లేకుండా సాధారణ దర్శనానికి రావాలనుకునే భక్తులు ప్రస్తుతం సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మొత్తం 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. గురువారం రోజు మొత్తం 59,548 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ.4.54 కోట్లు గా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల శనివారం, ఆదివారం రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!