

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. వేసవి సెలవుల ప్రభావంతో కొండపై జనసంచారం మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో, బయట క్యూలైన్లలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. కొన్ని చోట్ల క్యూలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్ లేకుండా వచ్చే వారికి సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల వరకు సమయం పడుతోంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదం అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇటీవల ఒకే రోజులో 74 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4 కోట్లకు పైగా నమోదైంది.
ఈ రోజు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శనం అనంతరం వేదాశీర్వచనం నిర్వహించనున్నారు.







.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!